సంచలనాలకు బ్రాండ్ అంబాసిడర్ నయనతార. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె నటిస్తున్న 75వ చిత్రానికి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆరు కోట్లు పారితోషికం తీసుకుంటున్న నయన వివాహానంతరం ఏకంగా 10 కోట్లకు పెంచేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈమె తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అట్లీ దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్‌తో నటిస్తున్న చిత్రం నయనతార బాలీవుడ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
అయ్యా చిత్రంతో నాయకిగా కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే సక్సెస్ రుచి చూశారు. గజిని, చంద్రముఖి ఇలా వరుసగా భారీ చిత్రాలు, విజయాలు వరించడంతో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. నిజ జీవితంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆ ఎఫెక్ట్ తనను సినీ జీవితంపై పడలేదు. అది ఆమె అదృష్టం అనే చెప్పాలి.
ముఖ్యంగా ప్రేమ వ్యవహారంలో అపజయాలకు కృంగిపోకుండా మనోధైర్యంతో ఎదుర్కొంటున్నా, మరో పక్క కెరీర్ పరంగా ఎదుగుతూ అగ్ర కథానాయకి స్థాయికి చేరుకున్నారు. లేడీ సూపర్‌స్టార్ అంతస్తును దక్కించుకున్నారు. అలా దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. విఘ్నేష్ శివన్‌తో పెళ్లి తరువాత నయన సినీ కెరీర్ పడిపోతుందని చాలామంది భావించారు. అయితే నయనతార అలాంటి వారి ఆలోచనలను చిత్తూ చేస్తూ కెరీర్ పరంగా మరింత ఎదుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment