Nandamuri Balakrishna's 'NBK 108' first look poster is out! - Sakshi
Sakshi News home page

NBK108: నందమూరి ఫ్యాన్స్‌కి ఉగాది సర్‌ప్రైజ్‌.. బాలయ్య ఫస్ట్‌లుక్‌ అవుట్‌

Published Wed, Mar 22 2023 10:49 AM | Last Updated on Wed, Mar 22 2023 11:39 AM

NBK108: Nandamuri Balakrishna, Anil Ravipudi Movie First Look Out - Sakshi

ఉగాది పండుగ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిరావిపూడి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించనుంది. బాలయ్య 108వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది.

చదవండి: టాలీవుడ్‌లో మరో విషాదం, పాపులర్‌ నటుడు కన్నుమూత

అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో ఈ చిత్రంపై భారీ అంచానలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ బాలయ్య లుక్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో కాజల్‌తో పాటు ధమాకా బ్యూటీ శ్రీలీల కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement