![Odia Actor Babusan Mohanty, His Wife And Heroine Prakruti Mishra Fight on Road - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/24/Heroine-Prakruti-Mishra.jpg.webp?itok=HrzLOC7B)
కళ్లతో చూసేదంతా నిజం కాదు అంటారు, కొన్నిసార్లు కళ్లతో చూస్తే గానీ నమ్మలేం అంటుంటారు. అంటే.. సందర్భాన్ని బట్టి కొన్ని అర్థాలు తారుమారవుతుంటాయి. ఇంతకీ ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఒడియా హీరోయిన్ ప్రకృతి మిశ్రా, హీరో బాబుషాన్ మెహంతి 'ప్రేమమ్' సినిమాలో కలిసి నటించారు. తాజాగా ఉత్కల్ అసోసియేషన్ చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. అప్పటికే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని బలంగా నమ్మింది మెహంతి భార్య తృప్తి. తన భర్తను ఆమె మాయచేసి బుట్టలో వేసుకుందని ఆగ్రహంతో ఊగిపోయింది.
సమయం కోసం వేచి చూసిన తృప్తి.. శనివారం నాడు భువనేశ్వర్ నుంచి తన భర్తతో బయలు దేరిన ప్రకృతి కారును రోడ్డుమీదే అడ్డగించింది. కారులోకి ఎక్కి ఆమెను జుట్టుపట్టుకుని లాగింది. దయచేసి సాయం చేయండి అని హీరోయిన్ అభ్యర్థిస్తున్నా అక్కడున్నవాళ్లు మాత్రం వీడియోలు తీయడానికే పరిమితమయ్యారు. దీంతో ఎలాగోలా ఆమె నుంచి విడిపించుకుని కారు దిగింది ప్రకృతి. కానీ నటుడి భార్య కూడా ఆమెను వెంబడిస్తూ కొడుతూ, నెట్టేస్తూ దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియోనెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు దీనిపై కేసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చదవండి: ఆ వార్తల్లో నిజం లేదన్న దిల్ రాజు బ్యానర్
‘రుద్రమదేవి’ బాలనటి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment