ప్రముఖ ఒరియా (ఒడియా) నటి ఝరానా దాస్(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఒడిశాలోని కటక్‌లో తన నివాసంలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. 'లెజెండరీ నటి ఝరానా దాస్ మరణవార్త కలిచివేసింది. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా తను ఒడియా ఫిలిం ఇండస్ట్రీకి అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ట్విటర్ వేదికగా ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు.
కాగా ఝరానా దాస్ 1945లో జన్మించారు. 1960లో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. శ్రీ జగన్నాథ్, నారి, అడినమేఘ, హిసబ్‌నిఖాస్, పుజఫుల, అభినేత్రి, మలజన్హ, హీరా నేళ్ల వంటి సినిమాలతో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. కటక్‌లో దూరదర్శన్ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్‌గానూ ఆమె పని చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతబ్ జీవితంపై ఓ డాక్యుమెంటరీ కూడా తీసి మన్ననలు పొందారు. ఝరానా క్లాసికల్ డ్యాన్సర్ కూడా! ఒడియా చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకుగానూ ఆమెకు జయదేవ్ పురస్కారం లభించింది.
Saddened to know about the demise of legendary Odia actress Jharana Das. She will always be remembered for her outstanding contribution to Odia film industry. My deepest condolences to the family and her admirers.
— President of India (@rashtrapatibhvn) December 2, 2022
చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రేజీఫెలో
జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్
Comments
Please login to add a commentAdd a comment