
అనారోగ్యంతో బాధపడుతున్న 'ఆర్‌ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ ప్రియుడి తల్లి పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన పాయల్.. ఆమెను ఎలాగైనా బతికించంటూ దేవుళ్లను వేడుకుంటోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తోంది.
సౌరభ్ ఢింగ్రా తల్లి అనితా ఢింగ్రా అస్వస్థతకు లోనవడంతో పాయల్ కంగారు పడుతోంది. ఈ మేరకు ఆమె ఫొటోలను షేర్ చేస్తూ.. 'ప్లీజ్ అందరూ ఆమె కోసం ప్రార్థనలు చేయండి.. ఈ ప్రార్థనలు అద్భుతాలను సృష్టించగలవు. దేవుడా.. దయచేసి అలా చేయకు' అంటూ ఎమోషనల్ అయింది.
అయితే ఆమె పరిస్థితి నానాటికీ ఇంకా విషమిస్తోందే తప్ప కుదుటపడుతున్నట్లు కనిపించడం లేదు. ఢిల్లీలో ఓ వెంటిలేటర్ బెడ్, హర్యానాలోని సోనీపట్‌లో వెంటిలేటర్ అంబులెన్స్ కావాలి. ఎవరైనా సాయం చేయండి అని వేడుకుంది. దీన్ని బట్టి అనిత కరోనా బారిన పడినట్లుందని, మంచి చికిత్స కోసం ఇబ్బంది పడుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్న పాయల్.. ఈసారి ఏం చేసిందంటే..
Comments
Please login to add a commentAdd a comment