
పెళ్లి సందడి మూవీతో కుర్రకారు మతి పొగొట్టింది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంక తెరకెక్కించిన ఈ చిత్రంతోనే శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె అందం, అభియనంకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో వరస ఆఫర్లు శ్రీలీలకు క్యూ కడుతున్నాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శ్రీలీల తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ
సోషల్ మీడియాలో అప్పడప్పుడు దర్శనం ఇచ్చే ఆమె తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ ఆసక్తికర కోట్‌ను జోడించింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ తాజా పోస్ట్‌లో శ్రీలీల.. ‘మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం వల్ల మనసును నియంత్రించుకోవచ్చు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆమె పోస్ట్ చూసిన నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం శ్రీలీల రవి తేజ హీరోగా త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
చదవండి: Prabhas-Pooja Hegde: అసలేం జరిగింది, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతుందా?
Comments
Please login to add a commentAdd a comment