‘జై’ సినిమాలోని ‘దేశం మనదే..తేజం మనదే...’ పాటతో ప్రాచుర్యం పొందిన ప్రముఖ తెలంగాణ సింగర్ నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ జైశ్రీనివాస్ ఇకలేరు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ సిమాలకు శ్రీనివాస్ ఎన్నో పాటలు పాడారు. సినిమా పాటలతోనే కాకుండా.. ప్రైవేట్ ఆల్బమ్‌లకు, షార్ట్ ఫిలింలకు, వెబ్ సిరీస్‌లకు పాటలు పాడారు. శ్రీనివాస్ దాదాపు 200కి పైగా పాటలు పాడారు. ‘ఒంగోలు గిత్త’, ‘జెండాపై కపిరాజు’ వంటి సినిమాల్లోని పాటలకు శ్రీనివాస్ గాత్రం అందిం చారు. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
గాయకుడు జై శ్రీనివాస్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.శ్రీనివాస్ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా, తోటి సింగర్‌లకు తీరని లోటని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment