
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డేకు ఈ ఏడాది అంతగా కలిసొచ్చినట్లు లేదు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సహా పూజా నటించిన సినిమాలన్నీ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్‌గా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ నుంచి సైతం పూజా తప్పుకున్నట్లు తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న పూజాకు వరుస ఫ్లాపులు కంటిమీద కునుకలేకుండా చేస్తున్నాయట. అంతేకాకుండా రెమ్యునరేషన్ విషయంలోనే తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తుందని, అందుకే పూజాకు ఆఫర్స్ కూడా తగ్గిపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
తాజాగా ఈ వార్తలపై స్పందించిన పూజా అవన్నీ అవాస్తవాలని తేల్చేసింది. డబ్బు కోసమే సినిమాలు చేయట్లేదని, కథ, పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ గురించి అంతగా ఆలోచించను అంటూ స్పష్టం చేసింది. ఒకవేళ తనకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఇప్పటికే చాలా సినిమాలు చేతిలో ఉండేవని, తాను మంచి కథ కోసమే చూస్తానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Comments
Please login to add a commentAdd a comment