బిగ్‌బాస్ ఫేం పూజా రామచంద్రన్ ఓ గుడ్ న్యూస్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది. తాను గర్భవతిని అని ప్రకటించింది. ఈ మేరకు భర్త జాన్ కొకెన్‌తో సన్నిహితంగా కలిసి ఉన్న ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేస్తూ ‘ అనేక భావోద్వేగాల మా జర్నీ మరో కీలక దశకు చేరింది. వచ్చే ఏడాది మా కుటుంబంలోకి మరొక వ్యక్తి వస్తున్నారు’అని ట్వీట్ చేసింది. పూజా రామ చంద్రన్ జాన్ కొకెన్ ని వివాహం 2019లో జరిగింది. పూజాకి ఇది రెండో పెళ్లి. అంతకు ముందు 2017లో విజె క్రెగ్‌తో పూజా వివాహం జరిగింది.
పెళ్లైన కొద్ది రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటుడు జాన్‌తో కొన్నాళ్ల పాటు సహజీవనం సాగించి, 2019లో పెళ్లి చేసుకున్నారు. స్వామి రారా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన పూజా.. బిగ్‌బాస్ షోతో మరింత గుర్తింపుని సంపాదించుకుంది.బిగ్‌బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డు ఎంట్రీ తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. స్ట్రాంగ్ లేడీగా పూజా రామచంద్రన్ బిగ్ బాస్ తెలుగు మీద ముద్ర వేసింది. కాగా, పూజా రామచంద్రన్ దంపతులకు నెటిజన్స్‌తో పాటు సీనీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.
Whirlwind of a love story, undying spirits, hearty laughters, crazy fights, endless conversations, lust, love and adventure, oh what a ride we’ve had and now we are excited to say our little miracle is on the way ♥️
— Pooja Ramachandran (@Poojaram22) November 12, 2022
2023 you are going to be so special! @johnkokken1 pic.twitter.com/Tj1TiRDxhw
Comments
Please login to add a commentAdd a comment