![Posani Krishna Murali Respond On His House Attack - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/30/posani_1.jpg.webp?itok=W4SRb5RD)
తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్ కల్యాన్ అభిమానులేనని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు తిడుతున్నారని అడిగితే దాడి చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. బుధవారం అర్థరాత్రి పొసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పొసాని ‘సాక్షి’తో మాట్లాడారు. ఇలాంటి దాడులను భయపడేదేలేదని ఆయన అన్నారు.
(చదవండి: పోసాని ఇంటిపై రాళ్లదాడి)
పవన్ కల్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని పోసాని అన్నారు. ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు కూడా పవన్‌ని ఎవరైనా ఏమైనా అంటే కొట్టేవాడని ఆరోపించారు. పవన్ ఊసరవెళ్లి రాజకీయాలపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అని పోసాని నిలదీశాడు. డబ్బులు ఇచ్చి మరీ రాళ్లదాడి చేయిస్తున్నారని పోసాని ఆరోపించారు. రాజకీయాలతో సంబంధం లేకున్నా తన భార్యను తిడుతున్నారని, అయినప్పటికీ చిరంజీవి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు.. టీడీపీ నాయకులు తిడితే.. తాను ఫైట్ చేశానని గుర్తు చేశారు. చిరంజీవిని అన్నలా భావించి, ఆయన కుటుంబాన్ని కాపాడానని, ఇప్పుడు ఆయన తమ్ముడు దాడులు చేయిస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాడని పోసాని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment