
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకొణె జంటగా తెరకెక్కిస్తోన్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే టైటిల్ రివీల్ చేసిన చిత్రబృందం.. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో గ్లింప్స్ రిలీజ్ చేశారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
(ఇది చదవండి: 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!)
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. కల్కి చిత్రం ఎడిటింగ్ రూమ్‌లోని వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రభాస్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఇది చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రభాస్ ఫైర్ గన్‌తో కనిపించి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అటు చిరు లీక్స్ నుంచి తాము ప్రేరణ పొందినట్లు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేయగా..అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం ట్వీట్ చేస్తూ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేశారు.
How is fiery🔥 Prabhas look from Kalki 2898AD?
— Manobala Vijayabalan (@ManobalaV) August 22, 2023
||#Kalki2898AD | #Prabhas || pic.twitter.com/vklelV8kxL