
ప్రతీక్ ప్రేమ్
‘‘సదా నన్ను నడిపే’ స్వచ్ఛమైన ప్రేమకథ. మనకు బాగా తెలిసిన వ్యక్తి చనిపోతున్నాడని తెలిశాక వారితో ఉన్న కొద్ది క్షణాలు ఎంత జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటామో ఇందులో చూపించాం. ఈ సినిమాలోని భావోద్వేగాలకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు’’ అని ప్రతీక్ ప్రేమ్ కరణ్ అన్నారు. ప్రతీక్ ప్రేమ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే, సంగీతం అందించిన చిత్రం ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. లంకా కరుణాకర్ దాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది.
ప్రతీక్ ప్రేమ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు అవ్వాలన్నదే నా ధ్యేయం.. అనుకోని పరిస్థితుల్లో హీరోగానూ మారిపోయాను. నేను హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘వానవిల్లు’ 2017లో విడుదలైంది. ఆ తర్వాత ‘సదా నన్ను నడిపే’ చేశాను. కర్నాటకలో జరిగిన ఓ వాస్తవ కథతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ‘కలిసుందాం రా, గీతాంజలి’ తరహాలో మంచి ఫీల్ ఇస్తుంది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను.. జూలై తర్వాత నా కొత్త సినిమా మొదలవుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment