
Priyanka Chopra to star opposite Marvel fame Anthony Mackie: గ్లోబల్ స్టార్ ప్రియాంక వరల్డ్‌వైడ్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పర్చుకున్న ప్రియాంక హాలీవుడ్‌లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ వరుస సినిమా అవకాశాలతో మరింత జోరు చూపిస్తోంది. ఇటీవలే హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంచైజీలో ఒకటైన 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్'తో అలరించింది. ప్రస్తుతం 'సిటాడెల్' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌తో బిజీగా ఉంది. అయితే తాజాగా ప్రియాంక మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్‌లో నటించిన యాక్టర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
అతనెవరో కాదు యాంట్ మ్యాన్, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్ వంటి హిట్ చిత్రాలతో పాటు ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న ఆంథోనీ మాకీ. ఇతనితో కలిసి ఎండింగ్ థింగ్స్‌లో నటించనుంది ప్రియాంక. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన యాక్షన్ కామెడీ మూవీ 'ట్రూ లైస్' తరహాలో ఉండనున్న ఈ చిత్రానికి కెవిన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేర సామ్రాజ్యం నుంచి బయట పడాలనుకునే ఓ మహిళా కథలా ఉండనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment