'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ 'కిస్సిక్'.. బాగానే ఫేమస్ అయింది. రిలీజైనప్పుడు బాగాలేదన్నారు గానీ ఇప్పుడు అందరూ తెగ డ్యాన్సులు చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఎవరూ తగ్గట్లేదు. మిగతా వాళ్ల సంగతేమో గానీ ఓ అనాథశ్రమంలో బామ్మలు ఈ పాటకు డ్యాన్స్ చేయడం మాత్రం తెగ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
కర్ణాటక బెల్గం ఊరిలో శాంతాయ్ వృద్ధాశ్రమం ఉంది. ఇందులో ఉంటే బామ్మలు ట్రెండీ గీతాలకు ఎప్పటికప్పుడు డ్యాన్స్ చేస్తూ బాగానే ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్లలో ఓ నలుగురు.. 'దెబ్బలు పడతయ్‌రోయ్' అంటూ 'పుష్ప 2' పాటకు భలే స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు తెలుగు నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది. 'కిస్సిక్' పాటలో కనిపించిన శ్రీలీల కూడా వీళ్ల డ్యాన్స్‌కి ఫిదా అయిపోయింది. వీడియోకి లైక్ కొట్టింది.
'పుష్ప 2' కలెక్షన్స్ విషయానికొస్తే మూడు రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. భారత బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం హిందీలోనూ రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. ఆదివారం కూడా భారీగానే టికెట్ సేల్స్ అయ్యింటాయి. టోటల్ వీకెండ్ వసూళ్ల రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్)
Comments
Please login to add a commentAdd a comment