పుష్ప సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప పాన్ ఇండియా లెవల్‌లో హిట్ అయ్యాక ఎవరి నోట చూసినా ఇదే డైలాగ్ వినిపించేది. దీని సీక్వెల్ అయిన పుష్ప: ది రూల్ మూవీలో దీన్ని మించి అనేట్లుగా అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ వాడుతున్నట్లు ఇటీవలే అల్లు అర్జున్ వెల్లడించాడు. ఇకపోతే ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్ నెట్టింట లీక్ అయినట్లు తెలుస్తోంది. అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం.. ఈ డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డైలాగ్ అదిరిపోయిందంటూ పుష్ప ది రూల్ (#PushpaTheRule) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.
ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి భాగం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే! తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టింది పుష్ప. ఒక్క హిందీలోనే వంద కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఇటీవలే పుష్ప రష్యాలోనూ విడుదలైంది. ఈ క్రమంలోనే సుకుమార్, బన్నీ, రష్మిక మందన్నా రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. తొలి పార్ట్‌ను మించిపోయేలా పుష్ప 2ను తెరకెక్కించే పనిలో పడ్డారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment