
Raj Kumar Rao And Patralekha Marriage: బాలీవుడ్ లవ్ బర్డ్స్ రాజ్ కుమార్ రావు, పత్రలేఖ ఇవాళ (నవంబర్ 15) పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక‍్కర్లు కొడుతోంది. అయితే చండీగఢ్‌లో వీరి వివాహం జరగనున్నట్లు బి-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం వీరి కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధువులు, సినీ సన్నిహితుల మధ్య విరి వివాహ వేడుక జరగనుందట. కాగా ఈ జంట నవంబర్ 13న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పటికి వివాహ తేదీని ప్రకటించలేదు.
Everyone is invited in this beautiful wedding ceremony 🥺❤️(virtually😹) of #RajkummarRao #Patralekhaa pic.twitter.com/rXGnNhRWbn
— Rajkumar Rao(Rini) (@Rajkummar_vibes) November 14, 2021
చండీగఢ్‌లోని ఒబెరాయ్ సుఖ్ విలాస్ స్పా రిసార్ట్‌లో శనివారం రాజ్ కుమార్ రావు, పత్రలేఖల నిశ్చితార్థం జరిగింది. సోమవారం(నవంబర్ 15) వివాహం సందర్భంగా వారి వెడ్డింగ్ కార్డును ఓ అభిమాని ట్విటర్‌లో షేర్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. నీలి రంగులో ఉన్న వెడ్డింగ్ కార్డ్ వధువువైపు నుంచి ఆహ్వానిస్తున్నట్లు ఉంది. షాన్డిలియర్లు, తామరలను కార్డుపై చూడొచ్చు. ఏడేళ్లుగా రిలేషన్‌లో ఉన్న రాజ్ కుమార్ రావు, పత్రలేఖలు నేడు వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారు.
చదవండి: బాలీవుడ్ కొత్త జంట ఎంగేజ్‌మెంట్.. డ్యాన్స్ చేసిన వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment