
రాజీవ్ సాలూరి, దీప్సిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆఖరి ముద్దు’. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మించిన సీవీ రెడ్డి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సీవీ ఆర్ట్స్‌పై నిర్మిస్తోన్న చిత్రం ఇది. స్వీయదర్శకత్వంలో సీవీ రెడ్డి రూపొందిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
మార్చిలో రెండో షెడ్యూల్ ఆరంభం అవుతుంది. ‘‘సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నా’’ అన్నారు సీవీ రెడ్డి. నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలతో పాటు ఈ చిత్రానికి సీవీ రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment