
రకుల్‌ప్రీత్ సింగ్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవులు వెళ్లారు. అక్కడ తన తమ్ముడు అమన్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారామె. తమ్ముడ్ని ఆటపట్టిస్తూ ‘పూల్ విత్ ఫూల్’ అని సరదాగా అన్నారు. అలాగే బీచ్ దగ్గర దిగిన ఫొటోను షేర్ చేసి, ‘‘సముద్రపు సువాసనను ఆస్వాదిస్తూ, ఆకాశాన్ని ఫీలవుతూ, మన మనసుకి రెక్కలు కట్టి, ఎగరాలి’’ అని పేర్కొన్నారు రకుల్. ఇక సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో, నితిన్‌తో ‘చెక్’, కమల్‌హాసన్ ‘భారతీయుడు’, హిందీలో ‘మే డే’ కమిట్ అయ్యారు. మాల్దీవుల నుంచి రాగానే ఈ చిత్రాల షూటింగ్స్‌తో బిజీ అయిపోతారు రకుల్ ప్రీత్‌సింగ్. (బంపర్ ఆఫర్ కొట్టేసిన రకుల్‌ప్రీత్..)
Comments
Please login to add a commentAdd a comment