Ram Charan attends South Asian Excellence pre-Oscars event, photo goes viral - Sakshi
Sakshi News home page

Ram Charan: దటీజ్‌ రామ్‌చరణ్‌.. యాక్టింగే రాదని హేళన చేసినవారితోనే గ్రేట్‌ అనిపించుకున్నాడు!

Published Sat, Mar 11 2023 4:46 PM | Last Updated on Sat, Mar 11 2023 5:18 PM

Ram Charan Attends South Asian Excellence Pre Oscar Event, Photo goes Viral - Sakshi

చిరుత సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు రామ్‌చరణ్‌. మగధీర సినిమాతో స్టార్‌గా మారిపోయాడు. కానీ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఈక్రమంలో జంజీర్‌(తెలుగులో తూఫాన్‌)తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇందులో చరణ్‌ ఏసీపీ విజయ్‌ ఖన్నాగా నటించగా స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా అతడితో జోడీ కట్టింది. ఈ సినిమా 2013లో రిలీజవగా చాలామంది నానారకాలుగా విమర్శించారు. అసలిది సినిమాయేనా? రామ్‌చరణ్‌కు యాక్టింగ్‌ వచ్చా? అతడి ముఖంలో సరిగా ఎక్స్‌ప్రెషన్స్‌ కనిపించడమే లేదు అంటూ విమర్శించారు. తీవ్రమైన నెగెటివిటీ ఎదుర్కొన్న చరణ్‌ తర్వాత హిందీలో మరే సినిమా చేయలేదు.

సరిగ్గా పదేళ్ల తర్వాత అదే రామ్‌చరణ్‌ను ఆరాధిస్తున్నారు అక్కడి జనం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో చరణ్‌ నటవిశ్వరూపం చూసి అల్లాడిపోయారు. స్టార్‌ హీరోల సినిమాల్లో గెస్ట్‌గా కనిపించినా చాలంటూ మన తెలుగు హీరో వెంటపడుతున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్‌ ఖాన్‌ 'కిసీకా భాయ్‌ కిసీకా జాన్‌' సినిమాలో అతిథి పాత్రలో కనిపించేందుకు ఒప్పుకున్నాడు చరణ్‌. ఇకపోతే ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే కదా! దీంతో ఈ సినిమా కోసం నిన్న మొన్నటి వరకు అమెరికాలో ‍ప్రమోషన్లు చేసిన హీరో ఇప్పుడు ప్రీఆస్కార్‌ పార్టీలో పాల్గొన్నాడు. ఈ పార్టీకి ప్రియాంక చోప్రా హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ సందర్భంగా ప్రియాంకతో కలిసి ఫోటోలు దిగారు చరణ్‌ దంపతులు. ఇప్పుడీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్క ప్రియాంకతోనే కాదు, హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేజే అబ్రమ్స్‌తో దిగిన ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఇది చూసి.. ఒకప్పుడు చరణ్‌కు నటన రాదని తిట్టినవారే ఇప్పుడు పొగడ్తలు కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement