
రమణ్ కథానాయకుడిగా, వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రెడ్డిగారింట్లో రౌడీయిజం'. సిరి మూవీస్ బ్యానర్‌పై కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నాడు. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ శుక్రవారంన నాడు ఈ సినిమా నుంచి ‘మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా..’ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా మంచి విజయం సాధించి ఎంటైర్ యూనిట్‌కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను యశస్వి కొండెపూడి ఆలపించారు. అనంతరం హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో సెకండ్ సాంగ్‌గా ‘మౌనమే మాట కలిపిన నేస్తమయ్యిందా..’ను విడుదల చేసి ఎంకరేజ్ చేసిన మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌గారికి అభినందనలు. మెగాస్టార్ చిరంజీవిగారి ఇన్‌స్పిరేషన్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాకు తొలి సినిమాలోనే మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌గారి నుంచి సపోర్ట్ రావడం మరచిపోలేని ఆనందాన్నిచ్చింది. ఇది వరకు మా సినిమాలో తొలి పాటను వై.ఎస్.షర్మిలగారు విడుదల చేశారు. ఇప్పుడు చరణ్‌గారు ఎంకరేజ్‌మెంట్‌ను అందించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే మిగిలిన పాటలు, ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అలాగే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
ఈ సినిమాకు సంగీతం: మహిత్ నారాయణ్, బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీ వసంత్, సినిమాటోగ్రఫీ: ఎ.కె.ఆనంద్, ఎడిటింగ్: శ్రీనివాస్ పి.బాబు, సంజీవరెడ్డి, ఆర్ట్:నరేష్ సిహెచ్, ఫైట్స్:అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు, కొరియోగ్రఫీ: చందు రామ్, రాజ్ పైడి, సాయిశివాజీ.
Comments
Please login to add a commentAdd a comment