Actor Ram Pothineni Gives Clarity On His Wedding Rumours, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Pothineni Marriage Rumours: పెళ్లి పుకార్లపై స్పందించిన హీరో రామ్‌

Published Wed, Jun 29 2022 4:28 PM | Last Updated on Wed, Jun 29 2022 5:16 PM

Ram Pothineni Clarity On His Wedding Rumours - Sakshi

టాలీవుడ్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో హీరో రామ్‌ పోతినేని ఒకరు. అయితే అతడు త్వరలోనే బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్లపై రామ్‌ స్పందిస్తూ.. అందులో ఎటువంటి నిజం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. 

'ఓరి దేవుడా, ఇక చాలు ఆపండి.. హైస్కూల్‌ ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నానంటూ మొదలైన రూమర్స్‌ మా ఇంటి దాకా చేరాయి. దీంతో నా ఇంట్లోవాళ్లకు, ఫ్రెండ్స్‌కు అలాంటిదేం లేదని సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజం చెప్పాలంటే అసలు నేను స్కూలుకు కూడా సరిగా వెళ్లేవాడినే కాదు' అంటూ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చాడు రామ్‌.

కాగా రామ్‌ నటించిన వారియర్‌ మూవీ తెలుగు, తమిళంలో జూలై 14న రిలీజ్‌ కాబోతోంది. తమిళ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించింది. మరోవైపు రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

చదవండి: పావురాల వ్యర్థాల వల్లే మీనా భర్త మృతిచెందాడా?..షాకింగ్‌ రీజన్‌
విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి ఏమన్నారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement