
రామ్ పోతినేని హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. రామ్ కెరీర్‌లో ఇది 22వ సినిమా. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేశ్‌బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు ‘‘పూర్తి స్థాయి వినోదం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.
ఇటీవల వరుసగా యాక్షన్ ఓరియంటెడ్ పాత్రలతో అలరించిన రామ్ ఈ మూవీలో ఓ యునిక్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన కెరీర్‌లోని ల్యాండ్‌మార్క్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. మహేశ్‌బాబు ఈ చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment