15 Years For Energetic Star Ram Pothineni In Telugu Film Industry | రామ్‌ ఫస్ట్‌ మూవీకి 15 ఏళ్లు - Sakshi
Sakshi News home page

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఫస్ట్‌ మూవీకి 15 ఏళ్లు

Published Mon, Jan 11 2021 4:59 PM | Last Updated on Mon, Jan 11 2021 8:19 PM

Ram Pothineni Completes 15 Years In Telugu Film Industry - Sakshi

తొలి చిత్రమే హిట్టయితే ఆ కిక్కే వేరప్పా.. అదిచ్చిన బూస్ట్‌తో జర్నీని బుల్లెట్‌ స్పీడ్‌లో నడిపేయొచ్చు. దేవదాసు సూపర్‌ హిట్‌ కావడంతో రామ్‌ పోతినేని కూడా అదే చేశాడు.  కానీ కొన్ని చోట్ల సడన్‌ బ్రేకులు పడ్డాయి, మరికొన్ని చోట్ల బండి నెమ్మదించింది. ఇక మిగతా చోట్ల రేసింగ్‌ స్పీడులో దూసుకుపోయాడు. అయితే హిట్లు, ఫ్లాపుల లెక్క ఎలాగున్నా క్రేజ్‌ మాత్రం అంతకు రెట్టింపు అవుతూనే వస్తోంది. పదిహేనేళ్ల వయసులోనే నటించడం మొదలు పెట్టిన ఆయన దేవదాసు చిత్రంతో హీరోగా మారారు. ఈ సినిమా రిలీజై నేటికి 15 ఏళ్లవుతోంది. (చదవండి: ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ మూవీ రివ్యూ)

ఈ సందర్భంగా రామ్‌ పోతినేని సంతోషం వ్యక్తం చేశారు. తనకు దేవదాసుతో సినీ జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "పదిహేనేళ్ల వయసులో టాలీవుడ్‌ అనే స్వర్గంలోకి అడుగు పెట్టాను. దేవదాసు రిలీజై సరిగ్గా పదిహేనేళ్లు అవుతోంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఎంటర్‌టైన్‌ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను కూడా! అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్వీట్‌ చేశారు. దేవదాసు పోస్టర్‌ను సైతం పంచుకున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ రెడ్‌బుల్‌ ఎనర్జీ స్టార్‌ రామ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేవదాసు నుంచే నీకు అభిమానులమైపోయాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రామ్‌ 'రెడ్'‌ చిత్రం జనవరి 14న రిలీజవుతోంది. ఏడు భాషల్లో అనువదించనున్న ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్‌ నటిస్తున్నారు. కన్నడ వెర్షన్‌ ఈ నెల 14నే విడుదల కానుంది. మిగిలిన వెర్షన్‌లను ఈ నెలాఖరున రిలీజ్‌ చేసే ప్లాన్‌లో ఉన్నాం. తమిళ వెర్షన్‌ని డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నాం. (చదవండి: రెడ్‌ ట్రైలర్‌: ఈ సారి మంట మాములుగా లేదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement