Rana Daggubati And Miheeka Bajaj Unseen Marriage Video Goes Viral: హీరో రానా దగ్గుబాటి గతేడాది ఆగస్టు8న మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.కరోనా నేపథ్యంలో రామనాయుడు స్టూడియోలోనే కుటుంబీకుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. కోవిడ్ నిబంధనల కారణంగా కేవలం సుమారు 30మంది బంధువుల సమక్షంలో వివాహం జరిగింది.
తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. గతేడాది ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అతిథులు ఎవ్వరిని పెళ్లి వేడకకు ఆహ్వానించలేదు. అయితే తాజాగా పెళ్లితంతుకు సంబంధించిన వీడియోను రానా భార్య మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. మిహీకా వీడియోకు వెంకటేవ్ కూతురు ఆశ్రిత, మంచు లక్ష్మీ సహా మరికొందరు ప్రముఖులు కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment