‘‘సుమగారు ఎందరికో స్ఫూర్తినిచ్చే మహిళ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం పెద్ద హిట్ కావాలి. ఇలానే సుమగారు సినిమాలు, షోలు చేస్తూ ఇతర భాషల్లో కూడా రాణించాలి’’ అన్నారు రానా. ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం రానా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్న కథా చిత్రం. ఇందులో జయమ్మ కథతో పాటు మరికొన్ని కథలూ ఉన్నాయి. వ్యక్తిత్వం పరంగా నేను వేరు.. జయమ్మ వేరు. అయితే ఇక నేను కూడా జయమ్మలానే ఉండాలనుకుంటున్నాను. ఈ సినిమాకు 18 రోజులు పని చేయాలనుకున్నాను.. 40 రోజులు పట్టింది. ఈ చిత్రం కోసం శ్రీకాకుళం యాస నేర్చుకున్నాను. ఈ సినిమాతో నన్ను యాంకర్‌గా ప్రేక్షకులు మర్చిపోతారేమోనని రానా అంటున్నారు. కానీ అది (యాంకరింగ్) అదే.. ఇది (సినిమా) ఇదే.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కీరవాణిగారు ఒక్క ఫోన్ కాల్‌తో ఈ సినిమాకు ఓకే చెప్పారు. ఆయనకు థ్యాంక్స్. ఒక ‘బాహుబలి’... ఒక ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ఒక ‘జయమ్మ పంచాయితీ’ (సరదాగా)’’ అని సుమ పేర్కొంది. ఇక డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ.. ‘‘సంకల్పం ధృడంగా ఉంటే కాలమే ముందుకు నడిపిస్తుందంటారు. సుమగారిని నాకు ఆ విధే పరిచయం చేసింది. ఈ సినిమా ఆమె వల్లే జరుగుతోంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విడుదల తర్వాత సుమగారిని జయమ్మ అనే పిలుస్తారు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment