Ranbir Kapoor Shamshera Movie Released In OTT: Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Shamshera OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన షంషేరా.. ఎక్కడంటే?

Aug 19 2022 2:29 PM | Updated on Aug 19 2022 4:23 PM

Ranbir Kapoor Shamshera Movie Streaming On Amazon Prime Video - Sakshi

కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం రణ్‌బీర్‌ కెరీర్‌లోనే లోయెస్ట్‌ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న చిత్రంగా నిలిచింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం షంషేరా. సంజు సినిమా అనంతరం దాదాపు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత రణ్‌బీర్‌ నటించిన మూవీ ఇది. కేజీఎఫ్‌ విలన్‌ సంజయ్‌దత్‌, వాణి కపూర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం రణ్‌బీర్‌ కెరీర్‌లోనే లోయెస్ట్‌ ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న చిత్రంగా నిలిచింది.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూలై 22న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. మరి ఇంకెందుకాలస్యం, ఇప్పటివరకు షంషేరాను చూడకపోతే వెంటనే వీక్షించేయండి.

చదవండి: సీనియర్‌ ఎన్టీఆర్‌తో బ్రేకప్‌, 17 సినిమాలు వదులుకున్న హీరోయిన్‌!
ప్రపోజల్స్‌పై సరిగమప విన్నర్‌ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement