
ఈ మధ్య సోషల్ మీడియాలో హీరోయిన్లను ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటున్నాం. లైవ్ చిట్‌చాట్‌లో హీరోయిన్లకు సంబంధం లేకుండ ప్రశ్నలు వేసి వారికి చిరాకు తెప్పిస్తుంటారు. అంతేగాక సోషల్ మీడయాలో వారి పోస్టులపై స్పందిస్తూ వివాదస్పదంగా కామెంట్స్ చేస్తుంటారు. అయితే వీటిని మన తారలు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. మరి వీపరితమైన కామెంట్స్ వస్తే తప్ప వాటికి స్పందించరు.
చదవండి: ఆహా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో: బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!
ఈ క్రమంలో నెటిజన్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంటారు. తాజాగా ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్నాకు ఇదే తరహలో చేదు అనుభవం ఎదురైంది. అయితే దీనిని అలా వదిలేయకుండా సదరు నెటిజన్‌కు రష్మిక తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా రష్మక నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఫస్ట్‌లుక్‌ను దసరా సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో రష్మిక నవ్వుతూ ఉంటే శర్వానంద్ సిగ్గు పడుతూ కనిపించాడు.
చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
ఇక ఈ పోస్టర్ ఓ నెటిజన్ రష్మికను ట్రోల్ చేస్తూ.. ‘దీన్ని సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారు’ అంటూ తన ఫొటోను షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. దీనికి రష్మిక వెంటనే ‘నా నటన కొసం’ అంటూ అతడికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సదరు నెటిజన్ ట్రోల్‌కు స్పందించిన తీరుపై కొందరూ రష్మికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో నటిస్తోంది. ఇందులో గ్రామిణ యువతి శ్రీవల్లిగా మాస్‌లుక్‌లో అలరించబోతోంది దీనితో పాటు శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో నటిస్తోంది.
Naa acting kosam. 😅🤣
— Rashmika Mandanna (@iamRashmika) October 15, 2021
Comments
Please login to add a commentAdd a comment