Rashmika Mandanna Kissed The Dog And Her Fans Felt Jealous: రష్మిక మందన్నాకు యూత్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజ్ వల్లే ఆమె 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న 'పుష్ప: ది రైజ్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి వచ్చిన ఆమె ఫస్ట్ లుక్, సామీ సామీ సాంగ్ ఎంత హిట్టయ‍్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామీ సామీ సాంగ్‌లో తన ఎక్స్‌ప్రెషన్స్, అందంతో అభిమానులను అలరించింది. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక. తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెంపుడు కుక‍్క 'పూచ్ ఒరా'ని ముద్దు పెట్టుకున్న ఫొటో షేర్ చేస్తూ 'వెల్‌కమ్ హోమ్ కిస్సెస్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన రష‍్మిక అభిమానులు 'ఛ.. ఈ ఛాన్స్ మాకు రాలేదే.. ఒరాను చూస్తుంటే అసూయగా ఉంది. మాకు రాని అవకాశం కుక్కకు వచ్చింది. కనీసం కుక్కలా పుట్టిన బాగుండేది.' అని కామెంట్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా రష్మిక నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప' డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'నేను శైలజ' చిత్రం ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత‍్వం వహిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో నటించనుంది రష్మిక మందన్న.
Comments
Please login to add a commentAdd a comment