Rashmika Mandanna Reveals Her Relationship Status, Says She Is Single - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండతో లవ్‌? మరోసారి క్లారిటీ ఇచ్చిన రష్మిక

Published Fri, Aug 5 2022 9:58 AM | Last Updated on Fri, Aug 5 2022 10:52 AM

Rashmika Mandanna Reveals Her Relationship Status, Says She Is Single - Sakshi

హీరోయిన్‌ రష్మిక మందన్నా శాండిల్‌ వుడ్‌ వర్ధమాన నటిగా వెలుగులోకి వచ్చింది. తర్వాత ఛలో అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చేసింది. ఆరంభమే బాగుండటంతో గీతా గోవిందం చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఆ చిత్రం అమ్మడిని ఆకాశానికి ఎత్తేసింది. పుష్ప చిత్రం ప్రపంచ సినిమానే పరిచయం చేసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిపోయింది. కాగా టాలీవుడ్‌ నటుడు విజయదేవర కొండతో కలిసి రెండు చిత్రాలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ.. పుకార్లు గట్టిగానే షికారు చేస్తున్నాయి. ప్రేమలో ఉన్నారని, డేటింగ్‌ చేస్తున్నారని, రహస్యంగా పెళ్లి కూడా జరిగిపోయిందని.. ఇలా రకరకాల ప్రచారాలు  నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

అయితే ఈ వ్యవహారంపై విజయ్‌ దేవరకొండ, రష్మిక ఇద్దరూ వివరణ ఇచ్చారు. తమ మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని, ఆ రూమర్స్‌లో నిజం లేదని స్పష్టం చేశారు. అయినా వీరి గురించి ఏదో విధంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో నటి రష్మిక ఇటీవలే ఒక భేటీలో తానిప్పటికీ సింగిలే అని తెలిపింది. అయితే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నా, బాలీవుడ్‌కు ఎగబాకినా, కోలీవుడ్‌లో మాత్రం సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తూనే ఉంది. కార్తీకి జంటగా సుల్తాన్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చినా, ఆ చిత్రంతో ఆశించిన క్రేజ్‌ను తెచ్చుకోలేక పోయింది. దీంతో తాజాగా విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న వారీసు చిత్రం పైనే రష్మిక భారీ ఆశలే పెట్టుకుంది.   

చదవండి: తేదిల్లో మార్పులు.. విడుదల తారుమారు
అతడు డ్రగ్స్‌ తీసుకోవడం కళ్లారా చూశా.. హీరో మాజీ ప్రేయసి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement