రష్మిక మందన్న మరాఠీ నేర్చుకుంది! | Rashmika Mandanna Speaks In Marathi | Sakshi
Sakshi News home page

రష్మిక మందన్న మరాఠీ నేర్చుకుంది!

Published Sat, Aug 10 2024 12:53 PM | Last Updated on Sat, Aug 10 2024 12:53 PM

Rashmika Mandanna Speaks In Marathi

సినిమాను ప్రేమిస్తేనే ఎన్ని కష్టాలు పడినా కోరుకున్న స్థాయికి చేరుకోగలరు. అందుకు ప్రతిభ, పట్టుదల, అంతకు మించి అదృష్టం కావాల్సి ఉంటుంది. ఇవన్నీంటికీ కేరాఫ్‌ నటి రషి్మక మందన్నా అని చెప్పవచ్చు. పాత్రల కోసం హీరోలే కాదు హీరోయిన్లు వర్కౌట్స్‌ చేస్తుంటారు. అయితే శారీరక భాషతో పాటు ఇతర భాషాలను నేర్చుకోవాలనే ఆసక్తి అతి కొద్ది మందికే ఉంటుంది. అలాంటి వారిలో నటి రషి్మక మందన్నా ఒకరు. అందుకే కన్నడం భాష చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఇటీవల హిందీలో రణబీర్‌ కపూర్‌కు జంటగా నటించిన యానిమల్‌ చిత్రం సంచలన విజయం సాధించడంతో రషి్మక మందన్నా నేషనల్‌ క్రష్‌గా మారారు. 

కోలీవుడ్‌లో కార్తికు జంటగా సుల్తాన్, విజయ్‌ సరసన వారిసు చిత్రాల్లో నటించినా మంచి విజయం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక తెలుగులో చెప్పనక్కర్లేదు. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఈమె అల్లుఅర్జున్‌కు జంటగా నటించిన పుష్ప చిత్రం జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించింది. దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న పుష్ప–2 చిత్రంపై మరింత ఆశలు పెట్టుకున్నారు. కాగా హిందీలో సవ్వా? అనే చిత్రంలో విక్కీ కౌశల్‌కు జంటగా నటిస్తున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కుతున్న చిత్రం ఇది. 

దీంతో చిత్రంలో మరాఠీ భాషలో సంభాషణలు అధికంగా ఉంటాయట. ముఖ్యంగా నటి రషి్మక మందన్నా పాత్రకు చాలా పెద్ద పెద్ద సంభాషణలు ఉంటాయట. దీంతో ఆ భాషను స్వచ్ఛంగా మాట్లాడాలంటే భాష తెలిసి ఉండాలని భావించిన దర్శకుడు లక్ష్మణ్‌ ఉడేకర్‌ మరాఠీ భాషను కచ్చితంగా నేర్చుకోవాలని చెప్పారట. దీంతో నటుడు విక్కీకౌశల్, నటి రషి్మక మందన్నా నాలుగు వారాల పాటు మరాఠీ భాషను, ముఖ్యంగా ఆ భాషలో మాట్లాడే విధానాన్ని క్రమం తప్పకుండా నేర్చుకుని ఆ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.

అంకిత భావం అంటే ఇదీ అంటున్నారు నెటిజన్లు. కాగా తరచూ సామాజిక మాధ్యమాల్లో ఉండే ప్రయత్నం చేసే నటి రషి్మక మందన్నా తాజాగా పక్కా మోడ్రన్‌ దుస్తుల్లో ఫొటో సెషన్‌ చేయించుకుని దిగిన ఫొటోలను తన ఎక్స్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement