నా కల రామ్‌చరణ్‌ వల్ల నిజం అయింది : చిరంజీవి | Rc15: Chiranjeevi Opens Up About His Dream To Work With Shanka | Sakshi
Sakshi News home page

Chiranjeevi: 'అది నా కల..చరణ్‌ వల్ల నిజమైంది'

Published Thu, Sep 9 2021 7:35 AM | Last Updated on Thu, Sep 9 2021 9:08 AM

Rc15: Chiranjeevi Opens Up About His Dream To Work With Shanka - Sakshi

Chiranjeevi: రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు నటుడు చిరంజీవి, దర్శకుడు రాజమౌళి,  బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలి సన్నివేశానికి రణ్‌వీర్‌ సింగ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, చిరంజీవి క్లాప్‌ ఇచ్చి, సినిమా స్క్రిప్ట్‌ను శంకర్‌కు అందించారు.

రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కొన్ని ప్రాజెక్ట్స్‌ ఎంతో ప్రత్యేకమైనవి. ఈ సినిమా అలాంటిదే. శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్నది నా కల. అది రామ్‌చరణ్‌ ద్వారా నిజం కావడం హ్యాపీగా ఉంది. యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు చిరంజీవి. ‘‘ఓ మంచి మెమొరబుల్‌ సినిమాను ప్రేక్షకులకు అందించనున్నాం’’ అన్నారు రామ్‌చరణ్‌.

కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, జయరామ్, నవీన్‌ చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: తిరుణ్ణావుక్కరసు, సహనిర్మాత: హర్షిత్‌ రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: నరసింహారావు.

చదవండి : RC 15: ఒక్క కాన్సెప్ట్‌ పోస్టర్‌కే అంత ఖర్చు పెట్టించాడా!
RC15:అదిరిపోయిన రామ్ చరణ్-శంకర్ ఫస్ట్‌ పోస్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement