RC15 Update: Director Shankar Plans Action Packed Scene For Ram Charan's RC15 - Sakshi
Sakshi News home page

RC15: 1200 మందితో రామ్‌చరణ్‌ రిస్కీ ఫైట్‌!

Published Wed, Jul 6 2022 10:00 AM | Last Updated on Wed, Jul 6 2022 10:22 AM

RC15: Ram Charan,Shankar Movie Latest Update - Sakshi

శంకర్‌ దర్శకత్వంలోని సినిమాల్లో పాటలు ఎంత రిచ్‌గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా మరో రిచ్‌ సాంగ్‌ను రామ్‌చరణ్‌ కోసం రెడీ చేశారు శంకర్‌. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్‌ లొకేషన్స్‌లో రామ్‌చరణ్, కియారాలపై దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్స్‌తో సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. గణేష్‌ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రాఫర్‌. అయితే ఈ పాట ఇక్కడితోనే పూర్తవదట. ఈ పాట కొనసాగింపు హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కూడా జరుగుతుందని తెలిసింది. జూలై 10లోపు ఈ పాటను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట శంకర్‌.

(చదవండి: హ్యాపీని నాకోసం రాయడం నా లక్‌)

ఇక ఈ పాట పూర్తి కాగానే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను శంకర్‌ ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ యాక్షన్‌ సీన్‌లో దాదాపు 1200మంది ఫైటర్స్‌ పాల్గొంటారట. దాదాపు 20 రోజుల పాటు ఈ రిస్కీ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ జరుగుతుందని భోగట్టా. ఈ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్‌ 75 శాతం పూర్తవుతుందట. ఆ తర్వాత షూట్‌ కోసం విదేశాలు వెళ్లనుంది యూనిట్‌. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ 95 శాతం పూర్తవుతుందని తెలిసింది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement