ఓటీటీలో భారీ యాక్షన్‌ చిత్రం.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ | Rebel Moon Part 2 The Scargiver OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో భారీ యాక్షన్‌ చిత్రం.. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌

Published Tue, Mar 19 2024 11:40 AM | Last Updated on Tue, Mar 19 2024 12:37 PM

Rebel Moon Part 2 The Scargiver OTT Streaming Date Locked - Sakshi

హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన 'రెబల్ మూన్: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్' చిత్రం గతేడాది డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను అందుకుంది. తెలుగు,తమిళం,హిందీ,కన్నడ,మలయాళం వంటి భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. పార్ట్‌-1 మంచి విజయాన్ని అందుకోవడంతో 'రెబెల్ మూన్ - పార్ట్ 2: ది స్కార్‌గివర్' తెరకెక్కించారు డైరెక్టర్‌. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదల చేయనున్నారు.

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను  హాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌లలో ఒకరైన జాక్ స్నైడర్ తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే భారీ అంచనాలు  ఉంటాయి. తన డిఫరెంట్ టేకింగ్‌తో వరల్డ్ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నారు. 300, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్‌మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టీస్ లీగ్, డాన్ ఆఫ్ ది డెడ్ వంటి ఎన్నో సూపర్ హిట్‌ చిత్రాలను ఆయన అందించారు.

పార్ట్‌-1 మాదిరే.. 'రెబెల్మూన్ - పార్ట్2: ది స్కార్‌గివర్' చిత్రాన్ని కూడా ఏప్రిల్‌ 19న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ,కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో  సోఫియా బౌటెల్ల, ఎడ్ స్క్రీన్, మైఖేల్ హ్యూస్‌మన్, చార్లీ హున్నామ్, షార్లెట్ మాగీ, స్టాజ్ నాయర్, బే డూనా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా విడుదల అయ్యే లోపు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న రెబల్ మూన్: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ పార్ట్‌ -1 చిత్రాన్ని చూసేయండి. ఇందులో భారీ యాక్షన్‌ సీన్లు మెప్పిస్తాయి. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేకుండా ఉన్న ఈ స్కై ఫి యాక్షన్ థ్రిల్లర్‌ను కుటుంబంతో సహా కచ్చితంగా చూడొచ్చు. ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా ఏప్రిల్‌ 19న 'రెబెల్ మూన్ - పార్ట్ 2: ది స్కార్‌గివర్' విడుదల అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement