thriller movies
-
Carry On Review: కదలకుండా కట్టిపడేసే థ్రిల్లర్
థ్రిల్లర్ జోనర్ అనేది సినిమా మొత్తం క్యారీ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. సినిమా ఓ లైన్ లో వెళుతున్నపుడు దాని జోనర్ ని కమర్షియల్ యాంగిల్ లో కూడా బ్యాలెన్స్ చేస్తూ క్యారీ చేయడం చాలా కష్టం. ఒకవేళ అలా పట్టు సడలకుండా క్యారీ చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ఆ కోవకే చెందిన సినిమా క్యారీ ఆన్. ఇదో హాలివుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో థ్రిల్లింగ్ జోనర్ లో వచ్చిన అరుదైన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాకి దర్శకుడు జేమ్ కలెక్ట్ సేరా. ప్రముఖ హాలివుడు నటులు టారన్, సోఫియా లీడ్ రోల్స్ లో నటించారు.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే భార్యభర్తలైన ఈథన్ కోపెక్, నోరా పార్సీ అమెరికాలోని ఎయిర్ పోర్టులలో లగేజ్ సెక్యురిటీ తనిఖీ సంస్థ అయిన టిఎస్ఎ లో పని చేస్తూ ఉంటారు. అది క్రిస్మస్ కాలం. ఎయిర్ పోర్టు పండుగ వాతావరణంలో ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. కొపెక్ తన ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని ఆ రోజు వేరే వాళ్ళు ఉండాల్సిన స్థానంలో తన పోస్ట్ వేయించుకుంటాడు. అది లగేజ్ స్క్రీన్ స్పెషలిస్ట్ డ్యూటీ. తాను రొటీన్ గా ప్రయాణీకుల లగేజ్ స్క్రీన్ చేస్తుండగా అనూహ్యంగా ఓ బ్లూటూత్ దొరుకుతుంది. ఆ బ్లూటూత్ కొపెక్ ధరించడంతో అసలు కథ మొదలవుతుంది.ఓ అనామకుడు కొపెక్ ను బ్లూటూత్ ద్వారా తాను చెప్పింది చెయ్యకుంటే అదే ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న తన భార్య నోరాని చంపుతానని బెదిరిస్తాడు. ఆ అగంతకుడు ఓ బాంబుని ఫ్లైట్ లోకి తరలించే ప్రయత్నిస్తుంటాడు. ఆ బాంబు బ్యాగేజీని లగేజ్ స్క్రీన్ దగ్గర కొపెక్ అడ్డుకోకూడదని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తూ బ్లూటూత్ ద్వారా కొపెక్ కు సూచనలిస్తుంటాడు. అసలే పండుగ కాలం ఎయిర్ పోర్టు నిండా జనం. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద సంఖ్యలో అపార ప్రాణ నష్టం. అందుకే కొపెక్ ఓ పక్క ఆ లగేజ్ ని ఆపాలని మరో పక్క తన భార్యను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం సినిమాకే హైలైట్.ముందుగా తనకు కనపడుకుండా తనను లక్ష్యంగా చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగడుతున్న ఆ హంతకుడిని వెతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కొపెక్ ఆ అగంతకుడి తో పాటు బాంబుని కనుక్కున్నాడా, అలాగే తన భార్యని కాపాడుకున్నాడా.. ఈ ప్రశ్నలకు సమాధానం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న క్యారీ ఆన్ సినిమాని చూడడం. ఈ సినిమా స్క్రీన్ ప్లే పైన చెప్పుకున్నట్టు ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాలో పాత్రలు పరిచయం అయ్యే దాకా మామూలు రొటీన్ సినిమా అనిపించినప్పటికీ బ్లూటూత్ దొరికినప్పటినుండి కథ వేగంగా పరిగెడుతూ ప్రేక్షకుడిని కదలకుండా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో లభ్యమవుతుంది. వర్త్ టు వాచ్ మూవీ ఈ క్యారీ ఆన్. సో యూ ఆల్సో క్యారీ ఆన్ ఫర్ క్యారీ ఆన్.-ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో భారీ యాక్షన్ చిత్రం.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన 'రెబల్ మూన్: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్' చిత్రం గతేడాది డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను అందుకుంది. తెలుగు,తమిళం,హిందీ,కన్నడ,మలయాళం వంటి భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. పార్ట్-1 మంచి విజయాన్ని అందుకోవడంతో 'రెబెల్ మూన్ - పార్ట్ 2: ది స్కార్గివర్' తెరకెక్కించారు డైరెక్టర్. ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదల చేయనున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన జాక్ స్నైడర్ తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి. తన డిఫరెంట్ టేకింగ్‌తో వరల్డ్ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నారు. 300, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్‌మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టీస్ లీగ్, డాన్ ఆఫ్ ది డెడ్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన అందించారు. పార్ట్-1 మాదిరే.. 'రెబెల్మూన్ - పార్ట్2: ది స్కార్గివర్' చిత్రాన్ని కూడా ఏప్రిల్ 19న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ,కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్ట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోఫియా బౌటెల్ల, ఎడ్ స్క్రీన్, మైఖేల్ హ్యూస్‌మన్, చార్లీ హున్నామ్, షార్లెట్ మాగీ, స్టాజ్ నాయర్, బే డూనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల అయ్యే లోపు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న రెబల్ మూన్: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ పార్ట్ -1 చిత్రాన్ని చూసేయండి. ఇందులో భారీ యాక్షన్ సీన్లు మెప్పిస్తాయి. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేకుండా ఉన్న ఈ స్కై ఫి యాక్షన్ థ్రిల్లర్‌ను కుటుంబంతో సహా కచ్చితంగా చూడొచ్చు. ఆ తర్వాత దీనికి సీక్వెల్‌గా ఏప్రిల్ 19న 'రెబెల్ మూన్ - పార్ట్ 2: ది స్కార్గివర్' విడుదల అవుతుంది. -
టాప్ 10 హర్రర్ సినిమాలు ఇవే..
-
సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే..
Top 5 Best Thriller Movies On Zee5 OTT In 2021: సినిమా అనేది ఒక ఊహా ప్రపంచం. సినీ రంగం ఎప్పటికప్పుడూ తన శైలి మార్చు కుంటుంది. ఇదివరకూ సంగీతం, డ్యాన్స్, జానపద, సాంఘిక, రాజకీయ, ఫ్యాక్షన్ కథల ఆధారంగా సినిమాలు వచ్చేవి. అంతేకాకుండా కామెడీ, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ జోనర్లే కాకుండా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసే జోనర్ థ్రిల్లర్. తమదైన శైలిలో సరికొత్త కథలతో థ్రిల్ అందిస్తున్నారు చిత్ర దర్శకులు. మన ప్రేక్షకులు కూడా థ్రిల్లర్ సినిమాలను ప్రత్యేక ఆసక్తితో వీక్షిస్తారు. కథతో కట్టిపడేస్తూనే, కథనంలో రక్తి కట్టించే మూవీస్ వస్తే ఇక మూవీ లవర్స్‌కు పండుగే. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. మంచి థ్రిల్‌తోపాటు, ఊహకందని సస్పెన్స్‌తో ఉన్న థ్రిల్లర్ సినిమాలు చూస్తే వచ్చే కిక్కే వేరు. దక్షిణ, ఉత్తర భాషల్లోనూ ఈ తరహా ప్రయోగాలు ఎన్నో జరిగాయి. ఏ భాషలో తెరకెక్కించిన వాటిని మిగతా భాషల్లోకి అనువదిస్తున్నారు. దీంతో భాషాబేధం లేకుండా వీక్షకులు ఎంటర్టైన్ అవుతున్నారు. కాగా ఇలాంటి విభిన్నమైన కథలకు నెలవుగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. వీటిలో తనదైన స్థానం సంపాదించుకున్న ఓటీటీ వేదిక జీ5. 2021 సంవత్సరంలో వచ్చిన టాప్ 5 థ్రిల్లర్ మూవీస్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో కొన్ని చిత్రాలు తెలుగు భాషలోనూ డబ్ అయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. 2021లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ విడుదల వారిగా చూసి ఆనందించండి. 1. ఆపరేషన్ జావా (ఫిబ్రవరి 12, 2021) 2. సైలెన్స్ (మార్చి 26, 2021) 3. స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్ (జూలై 9, 2021) 4. డయల్ 100 (ఆగస్టు 6, 2021) 5. 200 హల్లా హో (ఆగస్టు 20, 2021) 6. బాబ్ బిస్వాస్ (డిసెంబర్ 3, 2021) చదవండి: రిలీజైన నెలలోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఓటీటీ సిత్రాలు.. చదవండి: టాలీవుడ్ టూ హాలీవుడ్.. ఓటీటీల్లో రచ్చ చేస్తున్న సినిమాలు ఇవే -
థ్రిల్లింగ్ End
-
వెండితెర 2019
-
ఆ ముగ్గురి బాటలో...
సాక్షి, చెన్నై : హన్సిక కూడా రెడీ అయిపోతోంది అనగానే ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకు వెళ్లిపోతున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఈ ముంబై బ్యూటీ నోట ఇంకా పెళ్లి మాట రానే లేదులెండి. మరి దేనికి రెడీ అవుతోందనేగా మీ ఆసక్తి. థ్రిల్లర్ కథా చిత్రానికండి. నయనతార, అనుష్క, త్రిష బాటలో పయనించడానికి సిద్ధం అవుతోంది హన్సిక. అవును హన్సిక కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోంది. ఈ అందగత్తె ఇప్పుటి వరకూ అభినయంతో కూడిన గ్లామరస్ పాత్రలోనే నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అరణ్మణై–2 చిత్రంతో హర్రర్ పాత్రను కూడా రక్తి కట్టించారు. అయితే థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించలేదు. అదేవిధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది ఇప్పుడా అవకాశం హన్సికను వరించింది. మసాలా పడం, భోగన్, రోమిమో జూలియట్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన యూఆర్.జమీల్ మెగాఫోన్ పడుతున్న చిత్రంలో హన్సిక కథానాయకిగా సెంట్రిక్ పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి సమయంలో కథనంతా తన భుజస్కంధాలపై మోసుకెళ్లే చిత్రంలో నటించే అవకాశం రావడం విశేషమే. ఈ చిత్రం వివరాలను దర్శకుడు జమీల్ తెలుపుతూ హన్సికను దగ్గరుండి చూసిన తనకు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కథానాయకి పాత్రకు తనే కరెక్ట్‌గా నప్పుతుందనిపించిందన్నారు. కథ చెప్పగానే హన్సిక వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుటి వరకూ పోషించనటువంటి వైవిధ్యభరిత పాత్రలో హన్సికను ప్రేక్షకులు చూస్తారన్నారు. మహిళలు తమ కష్టాల నుంచి బయట పడడానికి ఏం చేస్తారన్నది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఈ చిత్రంలో హన్సిక పాత్ర గురించి ప్రస్తుతానికి చెప్పలేనని, అయితే ఇందులో హన్సిక భారీ ఫైట్స్‌ను కూడా చేస్తారని, అవి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని అన్నారు. ప్రేమ, హాస్యం అంటూ జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయని, జాయ్స్టార్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ నిర్మించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం జూలైలో సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జమీల్ చెప్పారు. -
నానా దర్శకత్వంలో ‘అబ్ తక్ చప్పన్ 3’
దాదాపు పదేళ్ల క్రితం రూపొందిన ‘అబ్ తక్ చప్పన్’లోనూ, ఈ నెల 27న విడుదల కానున్న ఈ చిత్రం రెండో భాగంలోనూ నానా పటేకర్ నటించారు. కాగా, ఈ చిత్రం మూడో భాగానికి దర్శకత్వం వహించాలని నానా నిర్ణయించుకున్నారు. హాలీవుడ్ చిత్రం ‘డై హార్డ్’ తరహాలో మంచి థ్రిల్లర్ మూవీగా ఈ మూడో భాగం సాగుతుందనీ, గత రెండు భాగాల కన్నా ఈ చిత్ర నిర్మాణ వ్యయం భారీగా ఉంటుందని నానా తెలిపారు.