Filmmaker Remo Dsouza Emotional Post On His Brother In Law Jason Watkins Death - Sakshi
Sakshi News home page

Remo Dsouza: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఇంట్లో విషాదం.. గుండె ముక్కలు చేశావు

Published Fri, Jan 21 2022 5:36 PM | Last Updated on Fri, Jan 21 2022 6:57 PM

Remo Dsouza Heart Break Note On His Brother In Law Jason Death - Sakshi

Remo Dsouza Heart Break Note On His Brother In Law Jason Death: ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌  రెమో డిసౌజ ఇంట్లో విషాదం నెలకొంది. రెమో బావమరిది జాసన్‌ వాట్కిన్స్‌ గురువారం చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెమో, అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. జాసన్‌ను కోల్పోయిన బాధను తన ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలో గురువారం రాత్రి తెలియజేశాడు రెమో. జాసన్‌తో సంతోషకరంగా ఉన్న క్షణాన్ని పంచుకుంటూ 'సోదరా మీరు మా హృదయాలను ముక్కలు చేశారు. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. విశ్రాంతి తీసుకోండి.' అంటూ పోస్ట్‌ పెట్టాడు. అలాగే రెమో భార్య, జాసన్‌ సోదరి లిజెల్‌ డిసౌజ కూడా తన సోదరుడి మరణంపై బాధను వ్యక్తపరిచింది. 
 

(చదవండి: ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్‌)

జాసన్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూ 'మాకు ఇలా ఎందుకు చేశారు. నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. ఎందుకు ?' అంటూ ఎమోషనల్‌గా ఇన్‌స్టా స్టోరి పెట్టింది లిజెల్‌. జాసన్‌ వాట్కిన్స్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జాసన్‌ మరణం గురించి తెలుసుకున్న ఓషివారా పోలీసులు వెంటనే విలే పార్లేలోని కూపర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం నివేదిక రావాల్సి ఉంది. అయితే జాసన్‌ మరణంపై రెమో డిసౌజ, లిజెల్‌ ఎలాంటి బహిరంగా ప్రకటన ఇప్పటివరకూ చేయలేదు. ప్రస్తుతం వారిద్దరూ వారి స్నేహితుడి వివాహం కోసం గోవాలో ఉన్నట్లు సమాచారం. జాసన్‌ వాట్కిన్స్‌ అనేక చిత్రాల్లో రెమోకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. 

(చదవండి: ఎందుకు అలా ఆలోచిస్తారు.. అలా పిలిస్తే నచ్చదంటున్న బ్యూటీ)



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement