Ritabhari Chakraborty: I Lost 12 Kgs, But Could Not Be A Part Of Movie - Sakshi
Sakshi News home page

Ritabhari Chakraborty: 12 కిలోలు తగ్గాను, కానీ ఏకంగా సినిమాలో నుంచే తీసేశారు

Published Wed, Feb 23 2022 9:22 PM | Last Updated on Thu, Feb 24 2022 8:51 AM

Ritabhari Chakraborty: I Lost 12 Kgs, But Could Not Be A Part Of Movie - Sakshi

Ritabhari Chakraborty Revealed Interesting News In An Interview: బెంగాలీ నటి రితభరి చక్రవర్తి 'నేక్‌డ్‌ (2017)' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది పరి సినిమాలో నటించింది. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా బ్రోకెన్‌ ఫ్రేమ్‌ అనే షార్ట్‌ ఫిలింతో పాటు ఇంకా టైటిల్‌ ఖరారు చేయని ఓ హిందీ చిత్రంతో తిరిగి బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది రితభరి.

'పరి సినిమా తర్వాత దాన్ని మించిపోయే పాత్రలే చేయాలని అనుకున్నాను. ఈ క్రమంలో నా దగ్గరకు వచ్చిన ఎన్నో అవకాశాలను చేజేతులా పోగొట్టుకున్నాను. ఒకసారైతే ప్రాజెక్ట్‌ ఓకే అయ్యాక అందులో నుంచి నన్ను తప్పించారు. ఆ సినిమాలో నేను మురికివాడలో నివసించే అమ్మాయిగా కనిపించడం కోసం 12 కిలోలు తగ్గాను. కానీ చివరి నిమిషంలో ఆ డైరెక్టర్‌ మమ్మల్ని సినిమాలో నుంచి తీసేసి కొత్తవాళ్లను తీసుకున్నాడు. చాలా బాధేసింది. గతేడాది రెండు సర్జరీలయ్యాయి. బెడ్‌పైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నేను ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేకుండా పోయాను. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో అందరికీ మళ్లీ కనెక్ట్‌ అవుతున్నాను' అని చెప్పుకొచ్చింది రితభరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement