నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి | Actress Arya Banerjee Death Was Not Homicide Autopsy Confirmed | Sakshi
Sakshi News home page

నటి ఆర్య బెనర్జీ మృతి: కీలక విషయాలు వెల్లడి

Published Mon, Dec 14 2020 2:47 PM | Last Updated on Mon, Dec 14 2020 7:42 PM

Actress Arya Banerjee Death Was Not Homicide Autopsy Confirmed - Sakshi

కోల్‌కతా: బాలీవుడ్‌ నటి ఆర్య బెనర్జీ గత వారం కోల్‌కతాలోని తన నివాసంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన బెనర్జీ ఆకస్మిక మరణంపై పలు అనుమానాలు  వ్యక్తమయ్యాయి. అయితే ఆమెది హత్య కాదని అనారోగ్య సమస్యల కారణంగా బెనర్జీ మృతి చెందినట్లు తాజాగా ఫోరెన్సిక్‌ నివేధికలో వెల్లడైంది. బెనర్జీ కొంతకాలంగా కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఫోరెన్సిక్‌ నివేధికలో వైద్యలు ధృవికరించారు. కాగా దీనిపై కోల్‌కతా పోలీసు జాయింట్‌ కమిషనర్‌ మురళీధర్‌ శర్మ మాట్లాడుతూ.. ‘నటి ఆర్య బెనర్జీది హత్య కాదు. హత్య జరిగినట్లు ఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఘటన స్థలంలోనే ఫోరెనిక్స్‌ నిపుణులు మృతదేహం శాంపుల్స్‌ సెకరించారు. అయితే తను చనిపోయిన సమయంలో బెనర్జీ పొట్టలో ఆల్కహాల్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు’ అని ఆయన తెలిపారు. (చదవండి: నటి ఆర్య బెనర్జీ అనుమానాస్పద మృతి)

ఆర్యబెనర్జీ జోధ్‌పూర్‌లోని తన అపార్టుమెంటులో కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం బెనర్జీ ఇంటి పనిమనిషి వచ్చి తలుపు కొట్టడంతో ఆమె ఎంతకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆమె సమచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసుల తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి బెనర్జీ తన గదిలో బెడ్‌పై మృతి చెంది కనిపించారు. కాగా బెనర్జీ ప్రముఖ దివంగత సితార విద్వాంసుడు పండిత్ నిఖిల్‌ బెనర్జీ కూతురు. ఆమె దక్షిణాది ప్రముఖ నటి సిల్క్‌స్మిత జీవికథ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’‌లో షకీలా పాత్ర పోషించారు. అంతేగాక హిం‍దీలో‌ పలు సినిమాల్లో నటిస్తూనే ముంబైలో మోడల్‌గా రాణిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement