Jr NTR Elevation Scenes Deleted From RRR Movie Revealed By RRR Movie Artist - Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ ఎలివేషన్‌ సీన్‌ను డిలీట్‌ చేశారు

Published Thu, Apr 21 2022 3:57 PM | Last Updated on Thu, Apr 21 2022 5:06 PM

RRR Charector Artist Revelas Jr NTR Elivation Scene Delets In Final Cuts - Sakshi

RRR Actor Revelas Jr NTR Elevation Scene Deleted: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదలైన ఈ మూవీలో సన్సెషన్‌ క్రియేట్‌ చేసింది. ఇందులో జక్కన క్రియేటివికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తగ్గదేలా అన్నట్టుగా హీరోల మధ్య ఎలివేషన్‌ సీన్స్‌కు ఆడియన్స్‌ నోళ్లు వెళ్లబెట్టారు. ఆ సీన్స్‌ ప్రతి ఒక్కరి చేత ఈళలు వేయించాయి. అయితే ఈ సినిమా విడులైనప్పటి నుంచి ఎన్టీఆర్‌ కంటే చరణ్‌ డామినేషన్‌ కాస్తా ఎక్కువగా ఉందనేది కొంతమంది అభిప్రాయం. ముఖ్యంగా ఈ అంశంపై తారక్‌ ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు.  

చదవండి: బిడ్డ పుట్టాక కాజల్‌ ఫస్ట్‌ పోస్ట్‌, ఇదేమీ ఆకర్షణీయంగా ఉండదంటూ!

ఇప్పటీకి ఈ అంశంపై సోషల్‌ మీడియా చర్చ జరుగుతూనే ఉంది. ఈనేపథ్యంలో  ఓ షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్‌కు సంబంధించిన సూపర్‌ ఎలివేషన్‌ సీన్‌ను డిలిటెడ్‌ సీన్స్‌లో కలిపేశారని ఈ మూవీలోని సపోర్టింగ్‌ రోల్‌ పోషించిన నటుడు రివీల్‌ చేశాడు. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ‘బ్రిటిష్‌ వాళ్లు  చరణ్‌-ఎన్టీఆర్‌ల సీన్స్‌పై స్పందిస్తూ.. తారక్‌కు సంబంధించిన ఓ పవర్ఫుల్‌ సీన్‌ను కట్‌ చేశారని చెప్పాడు. ‘ఎన్టీఆర్‌ను, రామ్‌ చరణ్‌ కొట్టిన సీన్‌ తర్వాత ఇది వస్తుంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ను కొరడాతో కొట్టిన అనంతరం బ్రిటీష్ సైన్యం ఆయనను జైలులో పెట్టిన సంగతి తెలిసిందే. అదే జైలులో కొంతమంది తెలుగు ఖైదీలు ఉంటారు. ఈ సీన్‌లో నేను కూడా ఉంటాను.

చదవండి: ఆ హీరోయిన్‌తో నటించాలనుంది : యశ్‌

అక్కడ ఎన్‌టీఆర్ ఏం మాట్లాడకుండా కూర్చొని ఉంటాడు. మేమంత ఆయన దగ్గరికి వెళ్లి బ్రిటీష్ వాళ్ళను ఎదిరించి మేము ఇలా జైలులో ఉన్నాం, కానీ మీరు మాత్రం వాళ్ళను కొట్టి భారతీయుడి సత్తా చూపించారని పొగుడుతాం. అంతేకాదు ఇకనుంచి మీరే మా నాయకుడని.. మేము మీ వెంటే మేముంటామంటూ నినాదాలు చేస్తుంటాం. ఆ సమయంలో మాలో కనిపించే ఆ ఉక్రోషం, ఏమోషన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ఈ సీన్ థియేటర్లలో పడుంటే మరో రేంజ్‌లో ఉండేది’ అంటూ సదరు నటుడు చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం అతడి కామెంట్స్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ఇది తెలిసి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ జక్కన్నపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి హీరోల్లో ఎవరిని తగ్గించనని చెప్పిన ఆయన ఇంతటి అదిరిపోయే ఎలివేషన్‌ సీన్‌ను ఎందుకు డిలీట్‌ చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు ఈ సీన్‌ను ఓటీటీ స్ట్రీమింగ్‌లో జోడిస్తారామోనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement