RRR Movie OTT Release Date and Streaming, Details Inside - Sakshi
Sakshi News home page

RRR OTT Streaming: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

Published Tue, Mar 29 2022 7:32 PM | Last Updated on Fri, Apr 8 2022 3:23 PM

RRR Movie OTT Release Date And Streaming  Full Details Here - Sakshi

RRR Movie OTT Release Date Here: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్‌ మానియా నడుస్తోంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేంతగా జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ను మలిచాడు. దీంతో ప్రేక్షకులు వన్స్‌మోర్‌ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది.

చదవండి: అలనాటి స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి

వెండితెరపై ఆర్‌ఆర్‌ఆర్‌ను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులంత ఇక డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మూడు నెలల తర్వాతే ఓటీటీకి వస్తుందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌ జీ5లో విడుదల కాగా.. హిందీ వెర్షన్‌ను నెటిఫ్లీక్స్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వినికిడి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై మరో ఆసక్తికర అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

చదవండి: ఫొటో క్యూబ్‌ డ్రెస్‌లో నటి ఉర్ఫీ, ఇదేం పిచ్చి.. అంటూ ట్రోల్స్‌

ఈ తాజా బజ్‌ ప్రకారంలో.. ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌ను 2 నెలల్లోనే ఓటీటీకి తీసుకొచ్చే ప్లాన్‌ చేస్తున్నారట. ఈ క్రమంలో మే 25వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్‌ చేసేందుకు జీ5 ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఇక హిందీ వెర్షన్‌ మాత్రం నెటిఫ్లిక్స్‌లో 3 నెలల తర్వాత అంటే జూన్‌లోనే స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తోంది. కాగా ఇందులో తారక్‌, చరణ్‌ల నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ విడుదలైన మూడో రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement