యశ్‌కు జోడీగా సాయిపల్లవి! | Sai Pallavi Roped In As Female Lead In Actor Yash's Yash19th Film, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Yash19th Movie Update: యశ్‌కు జోడీగా సాయిపల్లవి!

Published Wed, Dec 6 2023 6:11 AM | Last Updated on Wed, Dec 6 2023 10:25 AM

Sai Pallavi Roped In As Female Lead In Yash 19th Film - Sakshi

కన్నడ స్టార్‌ హీరో, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌కు జోడీగా సాయిపల్లవి నటించనున్నారనే టాక్‌ శాండిల్‌వుడ్‌లో వినిపిస్తోంది. యశ్‌ హీరోగా కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ‘కేజీఎఫ్‌: చాఫ్టర్‌–1’, ‘కేజీఎఫ్‌: చాఫ్టర్‌–2’ చిత్రాల తర్వాత యశ్‌ చేయనున్న ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

కాగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తారని, ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది. ఈ నెల 8న ఈ సినిమాకి సంబంధించిన వివరాలు అధికారికంగా రానున్నాయి. మరి.. ఈ చిత్రానికి దర్శకురాలిగా గీతూ మోహన్‌దాస్, హీరోయిన్‌గా సాయిపల్లవి పేర్లే ఖరారు అవుతాయా? వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement