Critics Choice Awards 2022: Samantha About Oo Antava Song Craze Deets Inside - Sakshi
Sakshi News home page

Samantha: నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయారు, ఆ ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు

Published Fri, Mar 11 2022 4:16 PM | Last Updated on Fri, Mar 11 2022 5:45 PM

Samantha About Oo Antava Song Craze In Critics Choice Award - Sakshi

ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తక్కువకాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. చిలిపి నవ్వుతో కుర్రకారును పడేసిన ఈ భామ తెలుగులో ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించింది. ఆ మధ్య ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇందులో ఆమె నటనకుగానూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అలాగే పుష్పలో ఆమె చేసిన ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. ఐటం సాంగ్‌ అయితే ఓ రేంజ్‌లో హిట్టయింది.

చదవండి: Prabhas - Rajamouli: నాకంటే మీకు ఆ స్టార్‌ హీరోలే ఎక్కువ..!

ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన ఈ సాంగ్‌ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. తాజాగా క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సామ్‌ ఈ ఐటం సాంగ్‌పై స్పందించింది. 'ఊ అంటావా పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఇది తెలుగు పాట అయినా కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్టయింది. జనాలు అంతకుముందు నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయి, ఊ అంటావా మావా పాటలో చాలా బాగా చేశానని చెప్తున్నారు. ఇది నిజంగా సంతోషకరం' అని చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement