సాక్షి, హైదరాబాద్: ‘ఈ కరోనా పాండమిక్ నా జీవన దృక్పథాన్ని మార్చివేసింది.. ముఖ్యంగా నేను వేగన్‌గా మారిపోయాను’ అని సినీతార సమంత అక్కినేని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ప్రకృతిని పెంపొందించడం’ అనే అంశం పైన వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ భూమి లేకున్నా మొక్కలను పెంచే హైడ్రోపోనిక్స్ టెక్నాలజీతో అవసరమైన కూరగాయల మొక్కలను పెంచడం ప్రారంభించానన్నారు. అందరూ ఇంటి వద్దనే అవసరమైన ఆహారాన్ని పండించుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. హైడ్రోపోనిక్స్ విధానంలో ఏ కూరగాయలనైనా పండించవచ్చని అర్బన్ కిసాన్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ సైరామ్ పి.రెడ్డి తెలిపారు. ఈ వర్చువల్ సదస్సులో 120 మంది సభ్యలు పాల్గొన్నారు.
చదవండి: కోవిడ్‌పై లఘు చిత్రం?
Comments
Please login to add a commentAdd a comment