సినీతారలు ఇప్పుడు కేవలం నటనతోనే సరిపెట్టుకోవడం లేదు. ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. హీరోయిన్ సమంత ఇందుకు అతీతం కాదు. హీరోయిన్‌గా ఉన్నత స్థాయికి ఎదిగినా ఆమె తన సామ్రాజ్యాన్ని ఇతర రంగాల్లోనూ విస్తరింపజేసుకుంటున్నారు. సెలబ్రిటీ అన్నాక విమర్శలు, ఆరోపణలు, మనస్థాపాలు సహజం. ఇలాంటివి సమంతను వదల్లేదు. ముఖ్యంగా వివాహ జీవిత వైఫల్యం, అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న సమంత స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.
36 ఏళ్ల ఈ బ్యూటీ జయాపజయాలను అతీతంగా నటనతో పాటు ఇతర వ్యాపారాలతో చేతినిండా సంపాదిస్తున్నారు. సమంత ఒక్క సినిమాకు రూ.5 కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ రాణిస్తున్నారు. హైదరాబాద్, ముంబై నగరాల్లో ఖరీదైన ఇళ్లు కొనుక్కున్నారు. పెప్సీ తదితర వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ సంపాదిస్తున్నారు. పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు సుమారు రూ.20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అదే విధంగా ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ పేరుతో పిల్లల కోసం ప్లే స్కూల్ నడుపుతున్నారు. సాకి అనే ఫ్యాషన్ బ్రాండ్ సొంతంగా నిర్వహిస్తున్నారు. సూపర్ ఫుడ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఏడాదికి రెండు మిలియన్ డాలర్లు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే సమంత స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment