
Samantha New Fashion Photos Goes Viral: సమంత.. ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా పాపులర్ అవుతోన్న పేరు. ఈ పాపులారిటీ నాగచైతన్యతో విడాకుల నుంచి మొదలైంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో జాతీయ స్థాయికి ఎదిగిన సామ్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగింది. అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాతో ఆమె హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్ స్వయంగా ప్రకటించింది. ఇందులో తను బై-సెక్సువల్ యువతి పాత్ర పోషిస్తుండంతో ఇది తనకు చాలెంజింగ్ రోల్ అని చెప్పుకొచ్చింది కూడా. సినిమాలే కాకుండా యాడ్స్‌తో కూడా ఫుల్ బిజీగా ఉంది సమంత. అయితే తాజాగా ఓ షూట్ కోసం బయటకు వచ్చిన సామ్ తిరిగి వెళ్తూ టోర్న్-పిన్ డ్రెస్‌లో కనిపించింది.
టోర్న్-పిన్ డ్రెస్ అంటే ఏంటీ ? అదెగా మీ డౌటానుమానం. టోర్న్ జీన్స్ గురించి తెలుసుగా, కొంతమంది వాడుంటారు కూడా. వాటిమీద జోక్‌లు వేసుకుని నవ్వుకొని కూడా ఉంటారు. హా.. అలాంటి టోర్న్ జీన్స్‌లానే టోర్న్ డ్రెస్‌లు వస్తున్నాయి. వాటికి పిన్నీసులు కూడా యాడ్ అయి ట్రెండ్ అవుతున్నాయి. అంటే చిరిగిని చోట పిన్నీసులు పెడతారు. హాలీవుడ్ ఫ్యాషన్ షోస్‌లో ఇప్పటికే ట్రెండ్ అవుతున్న ఈ రకం ఫ్యాషన్ మనదేశంలోకి సైతం వచ్చింది. ఆ మధ్య ఒకసారి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఇలాంటి డ్రెస్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు సమంత కూడా టోర్న్-పిన్ డ్రెస్‌లో కనువిందు చేసింది.
ట్రెండ్‌ను ఫాలో అవుతూ తన స్టైల్‌ను మార్చుకుంటూ ఫ్యాషన్ లేడీగా పేరు తెచ్చుకుంటుంది సామ్. ఈ వెరైటీ డ్రెస్‌లో కనువిందు చేసిన సమంత సరికొత్త ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది చదవండి: నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది
Comments
Please login to add a commentAdd a comment