హాస్పిటల్‌​ బెడ్‌పై సమంత.. కారణం ఇదే | Is Samantha Ruth Prabhu Hospitalised? Know The Truth | Sakshi
Sakshi News home page

Samantha: హాస్పిటల్‌​ బెడ్‌పై సమంత.. కారణం ఇదే

Published Thu, Oct 12 2023 5:12 PM | Last Updated on Thu, Oct 12 2023 5:41 PM

Samantha Now Hospitalized - Sakshi

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగిన సమంత కెరీర్ ఈ మధ్య ఏమంత ఆశాజనకంగా లేదని చెప్పవచ్చు. లేడీ ఓరియెంటెడ్ మూవీ 'శాకుంతలం' దారుణమైన ఫలితాన్నందుకోగా.. ఇటీవలే వచ్చిన రొమాంటిక్ మూవీ 'ఖుషి' రిజల్ట్‌ ఆమెను మరింత నిరాశ పరిచింది. ఈ రెండు చిత్రాలకూ సమంత మైనస్ అయ్యిందనే చర్చ కూడా జరిగింది.  ఈ చిత్రాల్లో ఆమె లుక్‌తో పాటు నటనకు పేరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సమంత అనారోగ్యం కూడా ఆమె లుక్స్, కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న ఆమె పలు ఫోటోలను తన ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పడు షేర్‌ చేస్తూ టచ్‌లో ఉంటుంది.

రోగ నిరోధక శక్తి కోసం
తాజాగా సమంత హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నట్టుగా, చేతికి సెలైన్ పెట్టించుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. . మందుల వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించి ఓ పోస్ట్ చేశారు. తనకు ఈ డ్రిప్సే ఇమ్యూనిటీ అందిస్తాయని ఇలా తెలిపింది. 'ఇమ్యూనిటీ బూస్ట్ వల్ల కలిగే లాభాలివే.. రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయ సంరక్షణ, కండరాల శక్తి, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి, హృదయానికి రక్త సరఫరా, ఎముకల బలహీనత పోగొట్టేందుకు ఈ డ్రిప్సే ఉపయోగపడుతాయి.'  అంటూ సమంత చెప్పుకొచ్చింది.  

దీంతో ఫ్యాన్స్‌ ఎలాంటి కంగారుపడాల్సాని అవసరం లేదని చెప్పవచ్చు. సమంతకు ఏమీ కాలేదని, తాను రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇలా సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు ఆమె చెప్పకనే చెప్పింది.

(ఇదీ చదవండి: రూ.25 లక్షల కోసం వెళ్లి మర్డర్‌ కేసులో ఇరుక్కున్నా: సై సూర్య)

ఇక సమంత కొత్తగా ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదు. గతంలో ఓకే చేసిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో మాత్రమే ఆమె నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ కూడా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. కానీ సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన నటించనుందని టాక్ నడుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement