Samantha Ruth Prabhu 'Most Strong-Hearted Person': Keerthy Suresh - Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో సమంత గురించి ప్రశ్న.. కీర్తి సురేష్‌ మనసులోని మాట ఇదే!

Published Tue, Apr 18 2023 7:51 AM | Last Updated on Tue, Apr 18 2023 10:43 AM

Samantha Prabhu Is A Strong Hearted Person Keerthy Suresh - Sakshi

తాజాగా నటి కీర్తీసురేష్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. కారణం ఈ బ్యూటీ నానితో జత కట్టిన దసరా చిత్రం సక్సెస్‌ కావడమే. అలాగే ఇటీవల కీర్తీసురేష్‌ గ్లామర్‌ డోసు పెంచడం కూడా. తమిళంలో ఇంతకు ముందు నటించిన సాని కాగితం చిత్రంలో డీ గ్లామర్‌ పాత్రలో కీర్తీసురేష్‌ నటనకు సినీ వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురిసింది.

ఆ తరువాత తెలుగులో మహేష్‌ బాబు సరసన నటించిన సర్కారు వారి పాట చిత్రంలో గ్లామర్‌ మెరుపులు మెరిపించి అలరించింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా భోళాశంకర్‌ చిత్రంలో నటిస్తున్న కీర్తీసురేష్‌, తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామన్నన్‌, జయం రవి సరసన సైరన్‌ చిత్రాల్లో నటిస్తోంది.

వీటిలో మామనిదన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తరచూ సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వార్తల్లో ఉండే ఈ అమ్మడు తన ఇన్‌స్ట్రాగామ్‌లోనూ అభిమానులతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు బదులిస్తుంటారు.

అలా.. ఇటీవల ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని నటి సమంత గురించి అడిగిన ప్రశ్నకు కీర్తీసురేష్‌ బదులిస్తూ సమంత తాను అబ్బురపడే నటి అని పేర్కొన్నారు. ఆమె చాలా స్ట్రాంగ్‌ వ్యక్తిత్వం కలిగిన మహిళ అని కొనియాడారు. ఇంకా చెప్పాలంటే సమంతను ఎవరూ అడ్డుకోలేరని, ఎవరూ ఆపలేరని అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement