స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. తమిళంలో ఆమె నటించిన “కాతు వాకుల రెండు కాదల్” సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులోనూ యశోద సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. రీసెంట్‌గా శాకుంతలం డబ్బింగ్ పూర్తి చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ తాజాగా అభిమానులతో చిట్‌చాట్ సెషన్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది. ఇక ఓ నెటిజన్ ఆమె ఇయర్ పియర్సింగ్ గురించి ప్రశ్నించారు. దీనిపై రియాక్ట్ అయిన సామ్.. ఈ ప్రశ్న అడిగినందుకు సంతోషం. ఈ ఎయిర్ పియర్సింగ్ నొప్పి తగ్గడానికి సుమారు 6నెలలు పట్టింది అంటూ చెప్పుకొచ్చింది.
#Samantha pic.twitter.com/kKVAN8rfqF
— Cinema Updates (@mastervijay2020) April 18, 2022
Comments
Please login to add a commentAdd a comment