అనుకున్నవన్నీ జరగవు, కొన్నిసార్లు ఊహించనివి జరుగుతాయి. ఇది జీవితానికే కాదు సినీరంగానికీ వర్తిస్తుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిలిం శాకుంతలం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. ఈ సినిమా కోసం సమంత ప్రత్యేకంగా అరుణ బిక్షు దగ్గర శిక్షణ తీసుకోవడం విశేషం.
ఈ చిత్రంలో దుర్వాస మహామునిగా మోహన్‌బాబు, దుష్యంతుడిగా దేవ్ మోహన్, మేనకగా మధుబాల నటించారు. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలో రిలీజైంది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఏమైందో ఏమో, అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే ఓటీటీలో విడుదల చేశారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో శాకుంతలం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో అల్లు అర్హ, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నీలిమ గుణ- దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు.
. @Samanthaprabhu2 starrer #Shaakuntalam is now streaming on @PrimeVideoIN in telugu, tamil, kannada, Malayalam and Hindi languages. pic.twitter.com/ZAUlJ9LYZ3
— Movies4u Official (@Movies4u_Officl) May 11, 2023
చదవండి: 15 ఏళ్లకే ప్రేమలో పడ్డా, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నా: స్టార్ నటి
Comments
Please login to add a commentAdd a comment