నేనేమీ తనను బలవంతపెట్టలేదు: సనా భర్త | Sana Khan Husband Denies Forcing Her To Quit Films | Sakshi
Sakshi News home page

తన నిర్ణయం తెలిసి షాకయ్యాను: నటి భర్త

Published Fri, Dec 18 2020 7:33 PM | Last Updated on Fri, Dec 18 2020 10:33 PM

Sana Khan Husband Denies Forcing Her To Quit Films - Sakshi

ముంబై: నటి సనా ఖాన్‌ను సినిమాల్లో నటించడం మానేయాలని తానెన్నడూ చెప్పలేదన్నారు ఆమె భర్త ముఫ్తీ అనాజ్‌. సనా తనకు తానుగానే ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ విషయంలో అభిమానులతో పాటు తాను కూడా షాక్‌కు గురయ్యానన్నారు. ‘గగనం’,, ‘కత్తి’, ‘మిస్టర్‌ నూకయ్య’ వంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన సనా ఖాన్‌.. తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందారు. హిందీ ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 6లోనూ పాల్గొని పాపులర్‌ అయ్యారు. కాగా తాను నటనకు స్వస్తి చెబుతున్నట్లు అక్టోబరులో ప్రకటన విడుదల చేసిన ఆమె.. ఇకపై సేవా మార్గంలో నడవాలని కోరుకుంటున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్‌ చేసింది: కానీ, నమ్మకంతో..)

అయితే నెల రోజులు తిరక్కుండానే గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త ముఫ్తీ అనాజ్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో భర్త చెప్పినందు వల్లే సనా ఈ నిర్ణయం తీసుకుందనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై స్పందించిన అనాజ్‌ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నువ్వు ఈ విధంగానే జీవించాలని తనకు ఎన్నడూ ఆంక్షలు విధించలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన నిర్ణయం ప్రకటించగానే నేను షాకయ్యాను. కరోనా కాలం కాబట్టి పని దొరక్క తను సినిమాలు మానేసిందని చాలా మంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. 

తనకు నటన మీద ఆసక్తి తగ్గింది. అందుకే సినిమాల నుంచి వైదొలిగింది’’అని చెప్పుకొచ్చారు. ఇక తమ పెళ్లి గురించి చెబుతూ.. ‘‘సనాను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను. నా ప్రార్థనలు ఆ దేవుడు ఆలకించాడు. తను కాకుండా వేరే ఎవరు నా జీవితంలోకి వచ్చినా ఇంత సంతోషంగా ఉండేవాడిని కాదు. తన మనసు మంచిది. అసలు హీరోయిన్‌ను ఎలా పెళ్లి చేసుకున్నావు అని కొంతమంది అడుగుతారు. వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అది. ఇది మా జీవితం. మా గురించి ఎవరూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు’’ అని భార్యపై ప్రేమను చాటుకున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement