Sarabhai Vs Sarabhai Actress Vaibhavi Upadhyay Passes Away - Sakshi
Sakshi News home page

Vaibhavi Upadhyaya : విషాదం.. కారు ప్రమాదంలో ప్రముఖ నటి మృతి

Published Wed, May 24 2023 10:49 AM | Last Updated on Wed, May 24 2023 11:28 AM

Sarabhai Vs Sarabhai Actor Vaibhavi Upadhyaya Dies In Car Accident - Sakshi

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో బుల్లితెర నటి వైభవీ ఉపాధ్యాయ(32) మృతి చెందారు. తన త‌న భాయ్‌ఫ్రెండ్‌తో ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వైభ‌వికి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మంగళవారం హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో తను ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది.

ఈ ప్రమాదంలో వైభవి మృతి చెందగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే వైభవి సోదరుడు హుటాహుటిన హిమాచల్‌ ప్రదేశ్‌కి బయలుదేరి వెళ్లాడు. నేడు ఆమె మృతదేహాన్ని ముంబైకి తీసుకురానున్నారు. ఈ రోజు సాయంత్రం వైభవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె సన్నిహితులు తెలియజేశారు. 

‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌’సీరియల్‌ ద్వారా వైభవీ ఫేమస్‌ అయింది. ఆ సీరియల్‌లోని జాస్మిన్ పాత్ర వైభవీకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీపికా పదుకొణె నటించిన ఛపాక్‌ సినిమాలో కూడా వైభవి నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement